రైల్వే ట్రాక్‌‌‌‌పై మంటలు..కాకతీయ ఎక్స్ప్రెస్‌‌‌‌కు తప్పిన ప్రమాదం

రైల్వే ట్రాక్‌‌‌‌పై మంటలు..కాకతీయ ఎక్స్ప్రెస్‌‌‌‌కు తప్పిన ప్రమాదం

నెక్కొండ, వెలుగు : సికింద్రాబాద్‌‌‌‌ నుంచి భద్రాచలం వెళ్తున్న కాకతీయ సూపర్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌కు సోమవారం అర్థరాత్రి వరంగల్‌‌‌‌ జిల్లాలో ప్రమాదం తప్పింది. రైల్వే ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌‌‌‌ జిల్లా ఎల్గూరు – నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌‌‌‌కు సమీపంలో గల పంట పొలాలకు సోమవారం రాత్రి రైతులు నిప్పు పెట్టారు.

మంటలు ఎగిసిపడుతూ క్రమంగా ట్రాక్‌‌‌‌పైకి చేరాయి. ఇదే సమయంలో కాకతీయ సూపర్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ భద్రాచలం వైపు వెళ్తోంది. మంటలను గమనించిన డ్రైవర్‌‌‌‌ ట్రైన్‌‌‌‌ను నిలిపివేశాడు. సుమారు 30 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి రావడంతో ట్రైన్‌‌‌‌ భద్రాచలం వెళ్లింది. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు రైల్వే ఆఫీసర్లు తెలిపారు.