ఎస్సీ,  ఎస్టీ కమిషన్‌‌‌‌కు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలి : టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఎస్సీ,  ఎస్టీ కమిషన్‌‌‌‌కు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలి : టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

బషీర్‌‌‌‌బాగ్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌కు రాజ్యాంగబద్ధంగా పూర్తిస్థాయి అధికారాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేపట్టాలని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. ఈ హక్కుల సాధన కోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపట్టాలన్నారు.

ఆదివారం హైదరాబాద్ బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి శ్రీనివాస్ అధ్యక్షతన ‘ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా విశ్రాంత న్యాయమూర్తి నియామకం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.

కమిషన్ చైర్మన్‌‌‌‌గా విశ్రాంత న్యాయమూర్తులను నియమించాలనే ప్రతిపాదనతో తాను ఏకీభవించడం లేదన్నారు. జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ ముత్తయ్య,  లక్ష్మణ్ నాయక్, సీవీ ప్రసాద్, తొండ సత్యనారాయణ, యాదగిరి, చైతన్య, పినెం రాజు తదితరులు పాల్గొన్నారు.