సీఈసీని కాదు.. మోదీని మార్చాలె  : కల్వకుంట్ల కవిత

సీఈసీని కాదు.. మోదీని మార్చాలె  : కల్వకుంట్ల కవిత
  • ఓయూలో బతుకమ్మ సంబురాల్లో కల్వకుంట్ల కవిత

ఓయూ, వెలుగు: 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను మార్చుడు కాదు. ప్రధాని మోదీని దించి.. సిస్టమ్ ను మార్చాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఈవీఎంలు పోయి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరగాలన్నారు. ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాలకు హాజరైన కవిత వారితో కలిసి బతుకమ్మ ఆడారు.

అనంతరం మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే  తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుందని, బహుజన తెలంగాణ కావాలంటే అదే బతుకమ్మ స్ఫూర్తితో ఉద్యమ స్వరూపం కావాలని పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం దక్కాల్సిందేనని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ముక్కు పిండి అయినా ఉస్మానియాకు రూ.వెయ్యి కోట్లు తెస్తామన్నారు. తెలంగాణ లో ఏ పార్టీ ఉన్నా సరే వారికి ఉస్మానియా విద్యార్థుల ఆశీర్వాదం కావాల్సిందేనని, ఒక మహిళగా తాను కూడా పార్టీ పెట్టి ఆశీర్వాదం కోసం వచ్చానని, తనను ఆశీర్వదించాలని కోరారు.