విజయ్ సినిమాలో విక్రమ్‌‌‌‌‌‌‌‌గా కమల్

విజయ్ సినిమాలో విక్రమ్‌‌‌‌‌‌‌‌గా కమల్

‘విక్రమ్’ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న కమల్ హాసన్... ప్రస్తుతం శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2’లో నటిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతోంది. ఇదిలాఉంటే విజయ్ హీరోగా రూపొందుతున్న ‘లియో’లో కమల్ హాసన్ నటించబోతున్నారట. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసిన లోకేష్‌‌‌‌‌‌‌‌ కనగరాజ్.. అదే సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు ‘లియో’ తీస్తున్నాడు. అందుకే ‘విక్రమ్‌‌‌‌‌‌‌‌’ గెటప్‌‌‌‌‌‌‌‌లో కమల్ ఇందులో కనిపించబోతున్నారట. ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ విషయంలో ఓ హింట్ ఇచ్చాడు. 

కమల్ పేరు చెప్పనప్పటికీ ఒక గద్ద ఫోటో పెట్టి ‘ఈగల్ ఈజ్ కమింగ్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరిగ్గా ఇలాంటిదే ‘విక్రమ్‌‌‌‌‌‌‌‌’ సినిమాలోని థీమ్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తుంది. పైగా ఈ పోస్ట్‌‌‌‌‌‌‌‌లో ట్రయాంగిల్ రెడ్‌‌‌‌‌‌‌‌ ఎమోజీని కూడా షేర్ చేశాడు. ఇది ‘విక్రమ్‌‌‌‌‌‌‌‌’ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లోని ‘కోడ్ రెడ్‌‌‌‌‌‌‌‌’ని గుర్తు చేస్తోంది. దీంతో ‘లియో’లో కమల్ నటించడం దాదాపు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. నెలాఖరు వరకూ సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్న కమల్.. మే లేదా జూన్ నెలలో ‘లియో’ షూట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నారు. విజయ్ సేతుపతి కూడా మూడు రోజుల పాటు ఈ మూవీకి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.