పెద్ద పెద్ద హీరోలంత ఒక దగ్గర చేరితే...గిట్లుంటది

పెద్ద పెద్ద హీరోలంత ఒక దగ్గర చేరితే...గిట్లుంటది

సినిమా షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉండే అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్.... లాంటి పలు సినీ పరిశ్రమల స్టార్స్, సెలబ్రెటీలను అంతా ఓ పెళ్లి  ఒక దగ్గరకు చేర్చింది. అదే ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్‌ కుమారుడు వివాహం. రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో జరిగిన ఈ పెళ్లికి సెలబ్రెటీలు, సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై హంగామా చేశారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే పెళ్ళిలో కనపడటంతో ఈ ఫొటోలు కాస్తా వైరల్ గా మారాయి. ఈ పెళ్ళిలో సెలబ్రిటీలు డ్యాన్సులు కూడా వేయడం అందర్నీ ఆకర్షించింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కలిసి పంజాబీ డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్షయ్ ఈ డ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోహన్ లాల్ సర్ మీతో డ్యాన్స్ చేయడం మర్చిపోలేనిది. ఈ మూమెంట్ ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటా అని పోస్ట్ చేశారు.