IPL 2023 : త్వరగా వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది: కేన్ విలియమ్సన్

IPL 2023 : త్వరగా వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది: కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్ గ్రౌండ్ లో ఎంత కూల్ గా ఉంటాడో అందరికీ తెలుసు. ఓడిపోతున్నా.. నవ్వుతూ జట్టులో స్పూర్తిని నింపుతాడు. అలాంటివాడు  గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరం అవ్వడం దురదృష్టకరం. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లో బౌండరీని ఆపే క్రమంలో విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయం అయింది. దాంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ  క్రమంలో విలియమ్సన్  స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. 

ఐపీఎల్ కు దూరం అయిన విలియమ్సన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘ఇంత త్వరగా టోర్నీ నుంచి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నేను నా టీం, డ్రెస్సింగ్ రూమ్ ను చాలా మిస్ అవుతున్నా. త్వరలో కలుద్దాం’ అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోను గుజరాత్ టైటాన్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు స్పందించిన కేన్ ఫ్యాన్స్.. అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.

కేన్.. న్యూజిలాండ్ కు చేరిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు చేతుల్లో ఊతకర్రలతో మోకాలికి కట్టు కట్టుకొని ఉన్న విలియమ్సన్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.