కన్నడ స్టార్ హీరో దర్శన్ పై చెప్పు విసిరేసిన దుండగుడు

కన్నడ స్టార్ హీరో దర్శన్ పై చెప్పు విసిరేసిన దుండగుడు

కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సాంగ్‌ విడుదల కోసం వెళ్లిన దర్శన్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరేశాడు. 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం కర్ణాటకలోని హోస్పేట్‌లో సాంగ్‌ విడుదల కార్యక్రమానికి దర్శన్ హాజరయ్యాడు. స్టేజీపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ ఘటనపై కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తన మనుసును బాధించిందని చెప్పారు. ఎవరూ మానవత్వాన్ని మరిచి ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడవద్దని కోరారు. అభిమానంతో ప్రేమను చూపించండి. అంతేగానీ ద్వేషం, అగౌరవంగా ప్రదర్శించకూడదన్నారు. ఇక దర్శన్‌ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.