
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై లెజెండ్ ప్లేయర్ కపిల్ దేవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. హిట్‌మ్యాన్ చాలా లావుగా ఉన్నాడని, కనీసం టీవీల్లో కనిపించేందుకైనా అతను సన్నబడాలని విమర్శించాడు. ‘టీవీల్లో చూసినా, బయట చూసినా రోహిత్ ఎప్పుడూ ఫిట్‌గా కనిపించడు. 140 కోట్ల మందికి రిప్రజెంట్ చేసే టీమిండియా కెప్టెన్ అలా ఉండటం సరైంది కాదు. ప్రతి ప్లేయర్‌కు ఫిట్నెస్ అవసరమే అయినా... కెప్టెన్ మరింత ఫిట్‌గా ఉండాలి. ఈ విషయంలో టీమ్ ప్లేయర్లకు హిట్‌మ్యాన్ ఆదర్శంగా నిలవాలి. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అతన్ని తప్పుబట్టను. కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాడు. ఇప్పటికైనా ఫిట్‌నెస్‌పై ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. బరువు తగ్గి సన్నబడితే మరింత కాలం ఆటలో కొనసాగొచ్చు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని మించినోళ్లు లేరు. వరల్డ్ స్పోర్ట్స్‌కు విరాట్ ఆదర్శంగా నిలుస్తున్నాడు’ అని కపిల్ వ్యాఖ్యానించాడు.