
జవహర్ నగర్, వెలుగు: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా మండలంలోని జమ్మిగడ్డలోని మారుతినగర్ కు చెందిన బల్ల మణెమ్మ(37) ఈ నెల 2న అదృశ్యమైంది.
అదేరోజు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం జమ్మిగడ్డలోని సాకేత్ టవర్స్ సమీప నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనంతరం మణెమ్మ కుటుంబసభ్యులను పిలవగా ఆమె కుమార్తె వచ్చి తల్లి మృతదేహాన్ని గుర్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.