108లోనే మహిళ ప్రసవం

108లోనే మహిళ ప్రసవం

కరీంనగర్ జిల్లా : 108 వాహనంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వీణవంక మండలంలో ఘన్ముక్ల గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108కి కాల్ చేశారు గ్రామస్థులు. 108 రాగానే ఆ మహిళను జిల్లా హస్పిటల్ కు తరలిస్తుండగా నొప్పులు తీవ్రం అయ్యాయి.

108 వాహనంలోనే ప్రసవించిన ఆమెకు.. ఆడ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు 108 సిబ్బంది. ప్రసవం తర్వాత కరీంనగర్ సర్కార్ హస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు తెలిపారు డాక్టర్లు.