హార్ట్ బ్రేకింగ్ విజువల్స్. నేపాల్ప్రకృతి విధ్వంసం మిగిల్చిన విషాదానికి సాక్ష్యాలు ఈ చిన్నారులు. ఒంటినిండా గాయాలు, అమాయకపు ముఖాల్లో వర్ణించలేని బాధ, కన్నవారికోసం తల్లడిల్లుతున్న పసిహృదయాలు. రెండేళ్ల చిన్నారి తమ్ముడిని వీపున కట్టుకొని వరదల్లో కొట్టుకుపోయిన తల్లిదండ్రులకోసం వెతుక్కుంటున్న ఐదేళ్ల నేపాల్ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విజువల్స్గుండెలు పిండేస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి.
Heartbreaking Visual from Nepal 💔
— Jeet (@JeetN25) August 30, 2026
Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.
Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g
ఈ వీడియోను Jeet అనే X అకౌంటులో ఆదివారం(ఆగస్టు30) షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది 4గంటల్లోనే 6లక్షల40వేల మంది చూశారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరకాలని చాలా మంది నెటిజన్లు దేవుడిని ప్రార్థించారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకున్నారు. అయితే కొందరు ఇది గతంలోనిదని కొందరు, ఫేక్ వీడియా అని కొందరు అంటున్నా ఎక్కువమంది ఇటీవలి నేపాల్ విధ్వంసం మిగిల్చిన విషాద విజువల్స్ అని అంటున్నారు.
