కరీంనగర్ అపోలో రీచ్ అపోలోలో అత్యాధునిక నేత్ర విభాగం ప్రారంభం

కరీంనగర్ అపోలో రీచ్ అపోలోలో అత్యాధునిక నేత్ర విభాగం ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్‌‌‌‌లో ఐ స్పెషలిస్ట్‌‌‌‌ డా.వంశీచక్ర శ్రీరామ్‌‌‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం అత్యాధునిక నేత్ర వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లు అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ నాగసతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యాధునిక పరికరాలతో పరీక్షలు, చికిత్సలు,శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి సిటీల్లో లభించే ఆప్తాల్మిక్‌‌‌‌ సేవలు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.