కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదుల వెల్లువ

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదుల వెల్లువ

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్.. ప్రజల నుంచి 328 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి అప్లికేషన్లను ఆఫీసర్లు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.

జగిత్యాల ప్రజావాణికి 93 అర్జీలు 

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. 

సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. 

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి మొత్తం 204 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, అధికారులు  పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి. గీతే అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి 25 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలో వివిధ మండలాల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలకు పంపించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.