అధికారుల నిర్వాకం.. వాహనాలు లేకున్నా అద్దె చెల్లిస్తున్రు

అధికారుల నిర్వాకం.. వాహనాలు లేకున్నా అద్దె చెల్లిస్తున్రు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఉపయోగిస్తున్న వాహనాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాలకు సంబంధించి బండి శ్రీనివాస్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా కీలక వివరాలను సేకరించారు. దాదాపు 21 వాహనాలను అద్దెకు తీసుకున్నామన్న అధికారులు.. ఒక్కో వాహనానికి 33వేలు అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. అయితే అందులో ఒక్క వాహనం కూడా ఉపయోగించడం లేదని తెలుస్తోంది. వాహనాలు లేకున్నా అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక అసిస్టెంట్ సిటీ ప్లానర్ కారు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పగా.. ఆ రిజిస్ట్రేషన్ నంబర్తో కారుకు బదులు ఆటో ఉండడం గమనార్హం. ఆ ఆటో హైదరాబాద్లో తిరుగుతున్నట్లు గుర్తించిన శ్రీనివాస్.. దానికి అద్దె చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లిన శ్రీనివాస్.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.