క్రిమినల్ బ్రెయిన్ : రూ. 20 లక్షల దోపిడీ కేసులో సూత్రధారి CID ఆఫీసర్

క్రిమినల్ బ్రెయిన్ : రూ. 20 లక్షల దోపిడీ కేసులో సూత్రధారి CID ఆఫీసర్

దోపిడిని అరికట్టాల్సినోళ్లే దోపిడికి పాల్పడితే.. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారి క్రిమినల్ గా మారితే దోపిడి దొంగల  ముఠాకు నాయకుడైతే.. బెంగళూరు లో 20 లక్షల దోపిడి కేసులో  సంచలన విషయాలు బయటికొచ్చాయి.  క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (CID) లో ఇన్స్ పెక్టర్ ఈ దోపిడీకి స్కెచ్ వేసినట్టు  విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నలుగురికి ట్రైనింగ్ ఇచ్చి మరీ దోపిడీ చేయడం సీఐడీ వ్యవస్థలోని లోపాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

 ఇటీవల బెంగళూరు భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యాపార వేత్తలను  బెదిరించి 20 లక్షలు దోపిడి చేశారు దొంగలు.   బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో  దోపిడీకి స్కెచ్ వేసింది  సీఐడీ ఆఫీసర్ అని తేలింది.   

బెంగళూరులోని మడివాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఓ హోటల్ లో  బస చేస్తున్న ఇద్దరు వ్యాపార వేత్తలను నిందితులు బెదిరించి దోచుకున్నారు ఐదుగురు దొంగలు. అయితే  ఈ దోపిడీ వెనక  సీఐడీ డిపార్టుమెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కనకగిరి అనే అధికారి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. హారీష్, షఫీ, షాని అనే నలుగురు వ్యక్తులతో కలిసి కనకగిరి ఈ దోపిడీకి పాల్పడ్డారని రుజువైంది. 

 ప్రస్తుతం ప్రధాని సూత్రధారి, సీఐడీ ఇన్స్ పెక్టర్ మహేష్ కనకగిరితోపాటు నిందితులు  పరారీలో ఉన్నారు. వారికి ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.