హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ మార్తాండ నగర్‌లో ఉన్న ఓ కో-లివింగ్ (Co-living) హాస్టల్ భవనంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. భవనం నుండి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్టల్ భవనంలో వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.
అయితే, ఈ ప్రమాదంలో ఒక పెద్ద ముప్పు తప్పిందనే చెప్పాలి. అదృష్టవశాత్తూ భవనంలో ఉన్న హాస్టల్ నివాసితులు, ఐటీ ఉద్యోగులు సమయానికి అప్రమత్తమయ్యారు. మంటలు పెద్దవి కాకముందే వారంతా సురక్షితంగా భవనం వెలుపలికి రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
