Vastu tips:రాశి ప్రకారమే ఇంటిని నిర్మించాలా.. సజ్జ కింద తలపెట్టి నిద్రిస్తే వచ్చే ఇబ్బందులు ఇవే..!

Vastu tips:రాశి ప్రకారమే ఇంటిని నిర్మించాలా.. సజ్జ కింద తలపెట్టి నిద్రిస్తే వచ్చే ఇబ్బందులు ఇవే..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి..  అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటి మెయిన్​ డోర్​ యజమాని రాశి ప్రకారం ఉండాలా.. అలాగే ఇంట్లో సజ్జ కింద తల పెట్టి పడుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న:   మేము త్వరలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం .  నాది మేషరాశి.  మెయిన్ డోర్ ఈస్ట్ లేదా నార్త్ వైపు ఉండాలని ఓ పూజారి చెప్పాడు. ఇంటి స్థలం ప్రకారం మొయిన్ డోర్ వెస్ట్ వైపు ఉంటేనే బాగుంటుంది. రాశులకు, ఇంటి నిర్మాణానికి.. మెయిన్​ డోర్​ దిక్కుకు ఏమైనా సంబంధం ఉంటుందా?

జవాబు: చాలామంది రాశుల ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఫేసింగ్ కూడా ముఖ్యమే. మెయిన్ డోర్ వెస్ట్ వైపు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రశ్న:మా ఇంట్లో సజ్జ ఉంది. సజ్జపైన పనికిరాని వస్తువులు ఉన్నాయి? తలభాగం సజ్జ కింద పెట్టుకొని నిద్రపోతాను. సజ్జ కింద  తల పెట్టి పడుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా?

జవాబు: ఇంట్లో సజ్జె ఉండటం మంచిదే. కానీ సజ్జె కింద పడుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. పిచ్చి పిచ్చి కలలు కూడా వస్తాయి. దాంతో నిద్ర సరిగ్గా పట్టదు. తల కూడా బరువు ఎక్కినట్లు ఉంటుంది. అందుకే ఇంట్లో సజ్జ దక్షిణ, పడమర వైపు మాత్రమే ఉండాలి. వాస్తు ప్రకారం ఆ దిక్కుల్లో బరువులు కూడా ఉండాలి.