ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అనే సాంగ్ మనం విన్నాం. నిజమే కదా. టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరిలోను ఏదోఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేని వ్యక్తులు ఉండరు. అయితే, దాన్ని గుర్తించి బయటకు తీయగలిగినపుడే ఆ టాలెంట్ బయటపడుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. టాలెంట్ నిరూపించుకోవడానికి ఫలానా వయసు ఫలానా ఊరు అని ఏమి ఉండదు.
ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. కర్నాటకకు చెందిన రైతు ఓ బేబీ అంటూ ఓ పాట పాడారు. ఇప్పుడా రైతు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
అమెరికన్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ 2015లో ఓ బేబీ అంటూ ఓ సాంగ్ ను విడుదల చేశాడు. ఆ సాంగ్ కు ఫిదా అయిన రైతు జస్జీస్ బీబర్ ను అనుకరిస్తూ పాడటం నేర్చుకున్నాడు. రైతు జస్టీస్ బీబర్ కంటే బాగా పాడుతున్నాడంటూ ఓం ఎస్ ఇసాయి పల్లి అనే యూట్యూబర్ తెలిసింది. ఆ యూట్యూబర్ పొలంలో పనిచేస్తున్న రైతును రిక్వస్ట్ చేయించి ఓబేబీ పాటపాడించాడు. ఇప్పుడా సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఆ వీడియో ను 2లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
రైతు పాడిన ఓ బేబీపాటపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 10సార్లు విన్నా…మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు జస్టిన్ బీబర్ కంటే రైతు బాగా పాడాడు అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
