ట్విటర్ పిటిషన్ ని కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

ట్విటర్ పిటిషన్ ని కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై ట్విటర్​ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు జూన్​ 30న తోసిపుచ్చింది. అంతేకాకుండా మైక్రోబ్లాగింగ్ సైట్‌కి కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. గతేడాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ట్విటర్ కోర్టులో సవాలు చేసింది.

కేంద్రం ఆదేశాలకు ఛాలెంజ్‌

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(2022)లో నిబంధనల ప్రకారం తన ప్లాట్‌ఫారమ్ నుంచి కంటెంట్‌ను తీసివేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ట్విటర్​ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారణ సందర్భంగా, అకౌంట్లను  బ్లాక్ చేయాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు దాని వెనుక గల కారణాలను  చెప్పాలని ఆ సంస్థ వాదించింది.  మరోవైపు, ట్విటర్  హ్యబిట్యూల్ నాన్​ కంప్లేంట్​ ప్లాట్​ఫారమ్​ అని కేంద్రం పేర్కొంది. బ్లాకింగ్ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రభుత్వం,  సంస్థ  ప్రతినిధుల మధ్య సుమారు 50 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించింది.  చట్టాలకు లోబడి ఉండకూడదనే ట్విటర్​ చూస్తోందని ప్రభుత్వం ఆరోపించింది.