దేవ్ ట్రైలర్ టాక్ : కార్తీ అడ్వెంచర్.. రకుల్ కాన్ఫిడెన్స్

దేవ్ ట్రైలర్ టాక్ : కార్తీ అడ్వెంచర్.. రకుల్ కాన్ఫిడెన్స్

 కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్’. ఇప్పటికే హిట్ పేర్ గా పేరుతెచ్చుకున్న వీళ్లు.. మరోసారి ‘దేవ్’ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ రోజు ‘దేవ్’ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యునిట్. ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హరీస్ జయరాజ్ బాణీలను అందించగా…  లక్ష్మణ్ కుమార్ నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవనుంది.

ట్రైలర్ ను గమనించినట్లయితే.. కార్తీ అడ్వెంచర్ లు చేయడానికి ఇష్టపడే యువకుడిగా కనిపిస్తున్నారు. కార్, బైక్ రేసర్ గా ట్రైలర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. రకుల్ మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదిగే అమ్మాయిగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ప్రతీ పనికి ఓ లెక్క ఉంటుంది అప్పుడే జీవితంలో ఎదగగలమనే వ్వక్తిత్వం ఉన్న క్యారెక్టర్ రకుల్ ది. వీరిద్దరి కెమిస్త్రీ కుదిరి ఎలా లవ్ లో పడ్డారో.. ఆపై ఎదుర్కొన్న చాలెంజస్ ఎంటని తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాలి మరి. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.  ప్రిన్స్ ఫిక్చర్, రిలయన్స్ భాగస్వామ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.