V6 News

వారంలో కేజీబీవీ పోస్టుల ఫలితాలు

వారంలో కేజీబీవీ పోస్టుల ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల(యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు వారంలో రిలీజ్ చేయనున్నారు. అధికారులు ఇప్పటికే ఫైనల్ కీ రిలీజ్ చేశారు. వారంలోపే రిజల్ట్ ఇవ్వాలని సమగ్ర శిక్షా ఆఫీసర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ ల్లో 1,241 సీఆర్టీ,  పీజీసీఆర్టీ, ఎస్ఓ తదితర పోస్టుల కోసం 43,056 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి జులై 24, 25, 26 తేదీల్లో  పరీక్షలు నిర్వహించారు. ఎగ్జామ్స్ కు 34,797 మంది అటెండ్ అయ్యారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫైనల్ కీలో ఒక్క క్వశ్చన్​కు మార్కు యాడ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రిజల్ట్ ఇచ్చిన వెంటనే, కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్​లు ఇవ్వనున్నట్టు 
అధికారులు చెప్పారు.