అక్టోబర్ 7న మోగనున్న "ఫోన్ బూత్"రింగ్.. మోషన్ పోస్టర్ రిలీజ్

అక్టోబర్ 7న మోగనున్న "ఫోన్ బూత్"రింగ్.. మోషన్ పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్, సిధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కలిసి నటించిన హర్రర్ కామెడీ చిత్రం ఫోన్ భూత్. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ మోషన్ పోస్టర్ ను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. దీనికి "భూతోన్ కి దునియా సే నాటౌట్ అనే క్యాప్షన్ కు జత చేసింది. ఇరవై మూడు సెకన్ల మోషన్ పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో విడుదలైన ఈ పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో అద్భుతమైన గిటార్ నోట్ ప్లే అవుతూ ఉంది. దీంతో పాటు స్పూకీ దిండ్లు కలిగిన సోపాలో ఇషాన్ అస్థిపంజరంతో కూర్చొని చిరునవ్వుతో కూడిన ముఖంతో ఉండడం గమనించొచ్చు. పక్కనే మరో షాట్ లో అస్థిపంజరాన్ని మెడపై వేసుకొని సిధాంత్ ఫోజివ్వడం చూడొచ్చు. తాంత్రిక నిపుణుడి ఫంకీ అవతార్‌లో బ్లాక్ డ్రెస్ లో ఉన్న కత్రినా ఎక్కడి నుంచో అకస్మాత్తుగా కనిపించడాన్ని గమనించవచ్చు. మొత్తం మీద ఈ మోషన్ పోస్టర్ ఒక చమత్కారమైన ప్రకంపనలు సృష్టించే విధంగా ఉండడంతో.. ఈ చిత్రం ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ భయానక్ కామెడీ హర్రర్ ఫిల్మ్ అక్టోబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)