ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న కవిత

ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న కవిత

హైదరాబాద్, వెలుగు :  నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత బుధవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ చాంబర్​లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన 12 స్థానాల నుంచి గెలుపొందిన వారి పదవీ కాలం ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చింది. బుధవారం వీరిద్దరూ ప్రమాణం చేస్తుండగా, ఇంకో 10 మంది చేయాల్సి ఉంది.