బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా

బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా

దమ్ముంటే తనను జైల్లో వేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కేంద్రం అమ్ముతోందన్నారు. పేరుకు విద్యుత్ సంస్కరణలు.. చేసేది ప్రైవేటీకరణ అని అన్నారు. విద్యుత్ ను  పూర్గిగా కార్పొరేటైజ్ చేయడమే కేంద్రం టార్గెట్ అన్నారు. బీజేపీ పరిపాలనలో మొత్తం దేశం నాశనమైందన్నారు. నిరుద్యోగ యువత రేటు పెరిగిందన్నారు. తెలంగాణలో 0.3 శాతం ఉంటే దేశంలో 7 శాతానికి పైగా ఉందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనన్నారు. దేశంలో 77 శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతుల్లోనే ఉందన్నారు. బయట దేశం పరువు పోతోందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి డిసెంబర్ లో 0.4 శాతానికి పడిపోయిందన్నారు.

బ్యాంకులను ముంచి దేశంలో 33  మంది  విదేశాల్లో పిక్నిక్ చేస్తున్నారన్నారు. వీళ్లంతా మోడీ దోస్తులే..గుజరాత్ వాళ్లేనన్నారు .వీటిపై దమ్మున్నోళ్లు మాట్లాడాలన్నారు. దమ్ముంటే తనను జైల్లో వేయాలన్నారు కేసీఆర్. తనను వేయడమేమో కానీ.. మిమ్మల్నీ జైల్లో వేయడం పక్కా అని అన్నారు. రఫెల్ డీల్ లో మోడీ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందన్నారు. బీజేపీ అవినీతి కుంభ స్థలాన్ని బద్ధలు కొడతామన్నారు. రఫెల్ డీల్ పై సుప్రీం కోర్టులో తాము పిటిషన్ వేస్తామన్నారు. వీటన్నిటి మీద ఢిల్లీలో పంచాయతీ పెడతాన్నారు. దేశ రాజకీయాల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని అన్నారు. వాజ్ పేయ్ ఉన్నప్పుడు సిద్ధాంతాలున్నాయన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికాగానే పెట్రోలో రేట్లు మళ్లీ పెరుగుతాయన్నారు. అమెరికాలో ట్రంప్  కు మద్దతిచ్చి  మోడీ ఏం సాధించారన్నారు.

దేశం నాశనమవుతోందని చాలా పుస్తకాలు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. ప్రధాన మోడీ చెప్పేది ఒకటి..చేసేదొకటన్నారు. మోడీ వైఫల్యాలపై జర్నలిస్టులు పుస్తకాలురాస్తున్నారన్నారు.  విద్యుత్ సంస్కరణల డ్రాఫ్ట్ బిల్లు సీఎంలకు పంపారన్నారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేశామన్నారు.మోటార్లకు మీటర్లు పెట్టాలని  మెడమీద కత్తి పెట్టారన్నారు.  మోడీ అబద్ధాలే ఎక్కువ చెబుతారన్నారు. ఏపీలో 25 వేల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని..మనం పెట్టడం లేదన్నారు. బిల్లు పాస్ కాకముందే  మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్నిఉల్లంఘించిందన్నారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల నష్టం వస్తున్నా మీటర్లు పెట్టబోననన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి చదువు వస్తదో రాదోనన్నారు కేసీఆర్. ఆయనకు బదులు వేరొకరితో మాట్లాడిస్తే బెటరన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. విద్యుత్ ను రూ.1.10  పైసలకు యూనిట్ ఇస్తున్నట్లు గజ్వేల్ లో  మిషన్ భగీరథ ప్రారంభ సభలో మోడీ చెప్పారన్నారు. అసలు దేశంలోనే   రూ.1. 10 పైసలకు యూనిట్ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కళ్ల ముందు ఇన్ని కనిపిస్తున్నా.. మోడీ అబద్ధాలు చెబుతున్నారన్నారన్నారు. కేంద్ర పవర్ పాలసీ వల్ల 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా..  విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్నారు. విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీకి  డబ్బులిచ్చే సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టులు అప్పజెప్పాలని చూస్తున్నారన్నారు.

తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బంద్ పెట్టయినా సరే.. వాళ్లు తెచ్చే సొలార్ పవర్ ను కొనాలని కేంద్రం నిబంధనలు  పెట్టిందన్నారు..  సొలార్ పవర్ కొనకపోతే ఫైన్లు విధిస్తామన్నారన్నారు. బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుందన్నారు. తనకు బడ్జెట్ అర్థం కాలేదని కిషన్ రెడ్డి అన్నారని..34 వేల కోట్లు ఎరువులకు సబ్సిడీ తగ్గించింది అబద్ధమా కిషన్ రెడ్డి చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు.. కిషన్ రెడ్డికే బడ్జెట్ అర్థం కాలేదన్నారు కేసీఆర్.