కేసీఆర్ పతనం ప్రారంభమైంది

 కేసీఆర్ పతనం ప్రారంభమైంది

సీఎం కేసీఆర్ సహా ఆయన  కుటుంబ పతనం ప్రారంభమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో తనకు మద్ధతు ఇవ్వాలని కోరారు. తాను గెలిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. గతాన్ని మరిచి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. కనీసం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు.

ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడులో అధికార పార్టీ వేల కోట్లు ఖర్చు పెడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా..? గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అవినీతిని అంతం చేయడానికి యువత ముందుకు రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.