ఆర్టీసీ మూడు ముక్కలు.. 20 శాతం ప్రైవేటుకి

ఆర్టీసీ మూడు ముక్కలు.. 20 శాతం ప్రైవేటుకి

ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదనీ చెప్పింది సర్కార్. ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడం సరైన చర్య కాదన్నారు. క్రమశిక్షణను తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ముఖ్యమంత్రి.

రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 10 వేల 400 బస్సులను…. భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులు పూర్తిగా ఆర్టీసీకి చెందినవి ఉన్నాయి. ఇవి పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయన్నారు. మరో 30 శాతం బస్సులు, అద్దె రూపంలో తీసుకున్నాయని…. ఇవి కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే ఉంటాయన్నారు

సంస్థలో తీసుకుంటున్న చర్యలన్నింటికీ….  ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే కారణమన్నారు CM. 40 ఏళ్లుగా జరుగుతున్న దాష్టీకంతో ఇదంతా చేయాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. ఏ ప్రభుత్వం వున్నా కార్మిక సంఘాల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. సమ్మె ఉదృతం చేస్తామనడం హాస్యాస్పదమని తెలిపారు సీఎం. ప్రభుత్వం ఎవర్నీ డిస్మిస్ చేయలేదని…. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారని చెప్పారు. గడువులోగా విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది “సెల్ఫ్ డిస్మిస్” అయినట్లేనన్నారు కేసీఆర్. డిపోలు, బస్ స్టేషన్ల దగ్గర గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు ముఖ్యమంత్రి. విధుల్లో ఉన్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా…  చర్యలు తీసుకుంటామన్నారు.

KCR government has taken key decisions on RTC