
కొత్త సెక్రటేరియట్ ..కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలకు భూమిపూజలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదటగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. రూ.4 వందల కోట్ల ఖర్చుతో సెక్రటేరియట్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తోంది ప్రభుత్వం.
డీ- బ్లాక్ ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త భవన నిర్మాణానికి… ఈశాన్య మూలన శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి అయ్యేలా కార్యాచరణ రెడీ చేశారు అధికారులు. భూమిపూజ కార్యక్రమానికి మంత్రులతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు.
అసెంబ్లీ కొత్త భవనానికి కూడా శంకుస్థాపన
సెక్రటేరియట్ కొత్తభవనం భూమిపూజ తర్వాత ఎర్రమంజిల్ లో అసెంబ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో భూమిపూజ చేశారు సీఎం. రూ.100 కోట్లతో ప్రసుత్తమున్న అసెంబ్లీ మోడల్లోనే కొత్త భవనం నిర్మించనుంది ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు భూమిపూజ చేశారు. pic.twitter.com/bHjZcTd0TT
— Telangana CMO (@TelanganaCMO) June 27, 2019