నల్లగొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్లగొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్లగొండ: జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు- టాటా ఏస్ వాహనం ఢీకొన్న దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.