పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని  మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.

ఆసుపత్రి వైద్యులను కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేసీఆర్, ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పెద్ది సుదర్శన్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడకు చేరుకున్నారు. కేసీఆర్‌ను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడటంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరామర్శ అనంతరం కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.

ALSO READ  : నేను స్ట్రీట్ ఫైటర్‌ను.. ఏసీ రూమ్ కార్యకర్తను కాదు..