కీర్తి సురేష్ బరాత్ డ్యాన్స్..మాస్ కాదు..ఊరమాస్

కీర్తి సురేష్ బరాత్ డ్యాన్స్..మాస్ కాదు..ఊరమాస్

పెళ్లి బరాత్ అంటే తెలంగాణలో మామూలుగా ఉండదు. మాస్ స్టెప్పులు..ఊరమాస్ ఎక్స్ ప్రెషన్స్తో  దుమ్మురేపుతారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా డీజే పాటలు వినిపించాయంటే చాలు..కాలు ఆటోమేటిక్గా ఆడాల్సిందే. అలాంటి బరాత్ డ్యాన్సుతో  స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్  అదరగొట్టింది.  ఊరమాస్ స్టెప్పులతో కేక పుట్టించింది. 

తెలంగాణా సంప్రదాయలు, సంస్కృతికి  దసరా చిత్రంలో పెద్ద పీట వేశారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా బరాత్ డాన్స్ ని పెట్టారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. సినిమలో వెన్నెల పాత్రలో నటించిన నటించిన కీర్తిసురేశ్‌..ఓ సీన్ లో భాగంగా పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో చేసే డ్యాన్స్ చేసింది. కిక్ ఎక్కించే స్టెప్పులతో హైలెట్‌గా నిలిచింది. కీర్తిసురేశ్‌ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. మూవీలో చమ్కీల అంగీ వేసి సాంగ్ ఇన్నాళ్లు ట్రెండింగ్లో ఉంటే...ప్రస్తుతం కీర్తిసురేష్ మాస్  డాన్స్ దాన్ని బీట్ చేసింది. 

చిత్రంలో తన పెళ్లి సమయంలో కీర్తి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. కీర్తి సురేష్ తీన్మార్ స్టెప్పుల వీడియోను మేకర్స్ విడుదల చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కీర్తి సురేశ్  డ్యాన్స్ కు ఫిదా అవ్వని వారుండరు. మాస్ స్టెప్పులతో...బ్యాండ్ బీట్​కు తగ్గట్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టింది మహానటి.

నాచురల్​ స్టార్​ నాని, కీర్తి సురేశ్ జంటగా​ నటించిన దసరా మూవీ శ్రీరామనవమి రోజును విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ తో దూసుకు పోతుంది. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. సింగరేణి ఏరియాలోని వీర్లపల్లి గ్రామం చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సాయికుమార్‌, మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని, పూర్ణ, జరీనా వహబ్‌, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించాడు. దసరా మూవీ తొలి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా మూవీగా నిలిచింది.