పొల్యూషన్ తగ్గించేందుకు ఢిల్లీలో కృత్రిమ వర్షం .. ఐఐటీ కాన్పూర్ ప్రతిపాదన

పొల్యూషన్ తగ్గించేందుకు ఢిల్లీలో కృత్రిమ వర్షం .. ఐఐటీ కాన్పూర్ ప్రతిపాదన

న్యూఢిల్లీ :  ఢిల్లీలో పెరిగిన ఎయిర్ పొల్యూషన్​ను కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించాలని కేజ్రీవాల్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు గురువారం ఢిల్లీ మంత్రులు గోపాల్ రాయ్, అతిషి.. ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమైంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షమే బెటర్ అని ఆ బృందం మంత్రులకు సూచించింది. అందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ వివరణాత్మక ప్లాన్ ఇవ్వాలని కోరింది. ఐఐటీ టీమ్ రూపొందించిన ఆ ప్లాన్ ను అమలు చేసేందుకు ఢిల్లీ సర్కారు సుప్రీం కోర్టు అనుమతిని శుక్రవారం కోరనుంది.

దీనికి కోర్టు అంగీకరిస్తే ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందం ఇచ్చిన ప్రణాళికకు సుప్రీంకోర్టు ఓకే చెప్తే కేంద్రంతో కలిసి ఢిల్లీ సర్కారు ఆ ప్లాన్​ను అమలు చేయనుందని గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు.