కేరళ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ పేరును ప్రకటించింది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఈ ప్రకటన చేశారు. మెట్రో శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావడంతో.. ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఆయన పేరును పార్టీ నాయకత్వం ఫైనల్ చేసింది.
కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ‘విజయ్ యాత్ర’ పేరుతో టూర్ నిర్వహిస్తున్నారు.ఈ యాత్రలో ఆయన శ్రీదరన్ పేరును ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను పార్టీ త్వరలోనే ప్రకటించనుందని ఆయన తెలిపారు. ఇటీవలే బీజేపీలో చేరిన శ్రీధరన్… అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీధరన్ వయస్సు 88 ఏండ్లు.

