
బాలీవుడ్ సినిమా 'ఫైర్ హెరా ఫేరి' కథను నిజం చేసింది ఓ కిలాడీ జంట. తక్కువ సమయంలో కోటీశ్వరులం కావాలనుకునే వారికి గుణపాఠం.. అధిక లాభాల పేరుతో వందలాది మందిని మోసం చేస్తున్న కిలాడీల గుట్టు బయటపెట్టే కథగా ఫైర్ హెరా ఫేరి బాలివుడ్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమా కథలో మాదిరిగానే కేరళకు చెందిన ఓ జంట.. బెంగళూరులో చిట్టీల పేరుతో మోసం చేసి కోట్లాది రూపాయలతో ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సినిమా 'ఫిర్ హేరా ఫేరి' కథను తలపించేలా బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కేరళకు చెందిన టామీ, షైనీ అనే దంపతులు చిట్ ఫండ్ పేరుతో వందలాది మంది పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలు మోసం చేసి పరారయ్యారు.
టామీ, షైనీ దంపతులు బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో 'A&A చిట్స్ అండ్ ఫైనాన్స్' అనే సంస్థను 25 ఏళ్లుగా నడుపుతున్నారు. నెలకు 15 నుంచి 20 శాతం వరకు అధిక రాబడిని ఇస్తామని ఇన్వెస్టర్లకు ఆశ చూపారు. దీనితో చాలా మంది ప్రజలు వారి జీవిత పొదుపులను, చివరికి ఆస్తులను కూడా అమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టారు.
మొదట్లో టామీ,షైనీ సకాలంలో చెల్లింపులు చేస్తూ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచుకున్నారు. అయితే జూలై 3 నుంచి చెల్లింపులు ఆగిపోయాయి.టామీ , షైనీ జంట అదృశ్యమయింది. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబో మన్నారు.
►ALSO READ | భూ వివాదమే వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు కారణం: బీహార్ పోలీసులు
రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిల్లల విద్య, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం దాచునుకు డబ్బును పెట్టుబడిగా పెట్టమని ప్రజలను ఒప్పించినట్లు FIRలో పేర్కొన్నారు. టామీ, షైనీ అదృశ్యం కాకముందే సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి చర, స్థిరాస్తులను లిక్విడేట్ చేసినట్లు తెలుస్తోంది.
'ఫిర్ హేరా ఫేరి' సినిమాలో మాదిరిగానే..
'ఫిర్ హేరా ఫేరి' సినిమాలో ముగ్గురు వ్యక్తులు చిట్ ఫండ్‌లో తమ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని కోల్పోతారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన కూడా దానికి దగ్గరగా ఉంది. అయితే ఇది నిజ జీవితంలో జరిగిన మోసం. టామీ, షైనీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన వందలాది మంది పెట్టుబడిదారులను రోడ్డున పడేసింది.