ఫోన్​ కోసం దుబాయి​కి పోయిండు

ఫోన్​ కోసం దుబాయి​కి పోయిండు

కొత్త ప్రొడక్ట్​, గాడ్జెట్​, ఫోన్​ మార్కెట్లోకి వస్తోందంటే... ఎప్పుడెప్పుడు కొందామా? అని ఎదురుచూస్తారు చాలామంది. అదే ఐఫోన్​ కొత్త సిరీస్​ అనుకోండి.. అందరికంటే ముందు కొనేయాలి అనుకుంటారు కొందరు. అందుకని మొబైల్​ స్టోర్ల ముందు ‌గంటలకొద్దీ ‘క్యూ’ లో నిలబడతారు. కానీ,  ఇతను మాత్రం డిఫరెంట్​. ఐ  ఫోన్​ కొనాలంటే దుబాయి ఫ్లయిట్​ ఎక్కుతాడు. ఈమధ్యే దుబాయి​కి వెళ్లి ఐఫోన్​ 14  ప్రో తెచ్చుకున్నాడు. ‘ఫోన్​ కోసం దుబాయి​కి వెళ్లడమేంటి!’ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇతని గురించి చదవండి.

కొచ్చికి చెందిన ఇతని పేరు ధీరజ్​ పల్లియల్. సొంతంగా బిజినెస్​ ఉంది. ఐ ఫోన్​ అంటే మస్త్ ఇష్టం. కొత్త సిరీస్ రావడమే ఆలస్యం వెంటనే కొంటాడు. అలాగని కేరళ లేదా బెంగళూరుకి​ ఫోన్స్​ వచ్చే వరకు ఆగడు. ఎందుకంటే.. మనదేశంలో కంటే కొన్ని రోజులు ముందుగానే దుబాయి​లో ఐఫోన్లు దొరుకుతాయి. అంతేకాదు మనదగ్గరితో పోల్చితే అక్కడ ధర కూడా తక్కువ. అందుకే ఈమధ్యే ఐఫోన్​ 14 ప్రో కొనేందుకు దుబాయి వెళ్లాడు​. ఐఫోన్ 8 కొనేందుకు 2017లో మొదటిసారి ​వెళ్లాడు ధీరజ్. ఐ ఫోన్ల కోసం ఇప్పటివరకు 4 సార్లు దుబాయి​ వెళ్లాడు. ‘‘మనదేశంలో ఐఫోన్ కొత్త సిరీస్ కొన్న మొదటి వ్యక్తి నేనే కావాలనేది నా కోరిక. అందుకే ఐ ఫోన్​ కొనేందుకు దుబాయి​కి వెళ్తా. మనదేశంలో ఐఫోన్​14 ప్రో ధర రూ. 1,59,000. కానీ, దుబాయి​లో రూ.1,29,000 కే వస్తుంది.  కాకపోతే వీసా, రానుపోను ఫ్లయిట్ టికెట్స్​కి రూ. 40 వేలు, ఇతర ఖర్చులు కలిపి రూ. 1,69,000 అయింది. మనదేశంలో 14 ప్రో ధర కంటే పది వేల రూపాయలు ఎక్కువ ఖర్చయ్యాయి” అని చెప్పాడు ధీరజ్. ఇతని గురించి విన్నవాళ్లంతా ‘ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా!’ అని ఆశ్చర్యపోతున్నారు.