న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. చేతి గాయంతో మెగా లీగ్‌కు దూరమైన ఇంగ్లడ్ పేసర్ బ్రైడన్ కార్స్ ప్లేస్‌లో లంక లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకుంది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందే నెట్ ప్రాక్టీస్‌లో కార్స్ చేతికి గాయమైంది.
మధుశంక రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరనున్నాడు. మరోవైపు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బుధవారం ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పాస్ అయితే ఈ నెల 17న జట్టుతో చేరే అవకాశం ఉంది.

