కాంగ్రెస్ ముట్టడి ఉద్రిక్తత.. విజయారెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ ముట్టడి ఉద్రిక్తత.. విజయారెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ నేతల నిరసన పలు చోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ భవన్ దగ్గర పార్టీ సీనియర్లు ఆందోళన చేపట్టగా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి పార్టీ కార్యకర్తలు యత్నించారు. దీంతో రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆమెను బలంవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయారు. మహిళా పోలీసులు విజయారెడ్డిని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించారు.

మరోవైపు గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ వార్ రూంలో పోలీసుల సోదాలను నిరిసిస్తూ కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు నెట్టేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వంతో పాటు, పోలీసులకు వ్యతిరేకంగా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.