
నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సంప్రదాయ మేళాలతో భారీ బందోబస్తు మధ్య గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.
ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియేట్ మీదుగా సాగి.. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం కానుంది.