మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ

మున్సిపాలిటీ  అభివృద్ధికి కృషి చేయాలి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ

కల్లూరు/ పెనుబల్లి, వెలుగు: మున్సిపాలిటీ అభివృద్దికి అందరూ కృషి చేయాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీజ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె కల్లూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలు, వనరులు, విధుల నిర్వహణ, పనుల నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అందుబాటులో ఉన్న సదుపాయాలు, సిబ్బంది సౌకర్యాలు, పనుల పురోగతి మొదలైన అంశాలపై చర్చించారు. పెనుబల్లి ప్రభుత్వ జూనియర్​ కాలేజ్​ను సందర్శించి రూ.19 లక్షలతో చేపట్టిన రినోవేషన్ పనులను పరిశీలించారు. పనులు నాసిరకంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై పీఆర్​ఏఈ, కాలేజీ ప్రిన్సిపాల్​కు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. వచ్చెనెల 15 వరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు.