పోడు పట్టాలపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

పోడు పట్టాలపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : పోడు పట్టాలకు సంబంధించిన అంశాలపై విచారణ కమిషన్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీడీఏ పీవో రాహుల్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో అనూజ్ అగర్వాల్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులతో కలిసి అటవీ హక్కుల పట్టాలు, పాలేరు సరస్సు, వైరా రిజర్వాయర్ బండ్ అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. అటవీ భూములపై కొత్త ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అర్హత లేని అటవీ హక్కుల పట్టాల రద్దులో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 

అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే, 10న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అక్టోబర్ 12న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాలోని 12.43 లక్షల మంది ఓటర్లలో ఇప్పటికే 81.66 శాతం వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. అలాగే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూలై 15 నుంచి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా అమలులో ఉన్న ఫ్రైట్ ఆన్ లారీ సౌకర్యాన్ని నిలిపివేసినట్లు తెలిపారు.