ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి :  ఖమ్మం  కలెక్టర్ అనుదీప్  దురిశెట్టి

కూసుమంచి,వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల ను త్వరగా పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను  ఖమ్మం  కలెక్టర్​ అనుదీప్​  దురిశెట్టి  ఆదేశించారు.  గురువారం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలో  ఆయన  పర్యటించారు. ఇస్లావత్ తండా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల  పురోగతిని   తనిఖీలు చేశారు.   

తిరుమలాయపాలెం మండలంలో మొత్తం 802 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 736 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు.  కార్యక్రమంలో మండల తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, హౌజింగ్ డిఇ జగ్రాం, ఏఇ నవ్య,  పంచాయతీ కార్యదర్శి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.