V6 News

మూడు రేషన్ షాపులు సీజ్ .. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీ

మూడు రేషన్ షాపులు సీజ్ .. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీ

కల్లూరు, వెలుగు: కల్లూరు మండల పరిధిలోని కొర్లగూడెం, పేరువంచ, కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఖాన్ ఖాన్ పేట గ్రామాల్లోని రేషన్ దుకాణాలపై హైదరాబాద్ కు చెందిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ అంజయ్య నేతృత్వంలో అధికారుల బృందం శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఖాన్ ఖాన్ పేట రేషన్ షాప్  లో 64 క్వింటాళ్లు, పేరువంచలో 12.5 కింటాళ్లు, కొర్లగూడెం రేషన్ దుకాణంలో 128 కింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయని గుర్తించి మూడు షాపులను సీజ్​ చేసినట్లు విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ అంజయ్య తెలిపారు.