ఎవరెస్ట్ బేస్ క్యాంపు పై గిరిజన యువకుడు

ఎవరెస్ట్ బేస్ క్యాంపు పై గిరిజన యువకుడు

భద్రాచలం, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్​ గ్రామానికి చెందిన బి.మోతీకుమార్​ సముద్రమట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్  శిఖరం బేస్​ క్యాంపు వరకు వెళ్లి, అక్కడ ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. త్వరలో ఎవరెస్ట్  శిఖరాన్ని అధిరోహించబోతున్న మోతీకుమార్​ అక్కడి నుంచి వీడియో మెసేజ్​ పంపించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​ అవుతోంది. ‘సార్, గిరిజనుల సంక్షేమం కోసం మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా, మీపై ఉన్న అభిమానంతో ఈ ఫ్లెక్సీని తీసుకుని వచ్చాను. ధన్యవాదాలు’ అని ఆ యువకుడు సందేశం పంపించాడు. మోతీకుమార్​ గతంలో 5,895 మీటర్లు ఎత్తు ఉన్న మౌంట్​కిలీ మంజరో పర్వతం , 5,642 మీటర్ల మౌంట్​ ఎలబ్రస్​ పర్వతం అధిరోహించాడు.

మౌంట్​ కోసియాస్కో అధిరోహించిన తండ్రీకొడుకులు

పెద్దపల్లి: ఆస్ట్రేలియా దేశానికి చెందిన మౌంట్​ కోసియాస్కోను పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్​రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి(15) అధిరోహించారు. ఏప్రిల్​ 30న పర్వతారోహణ మొదలు పెట్టిన వీరు శనివారం పూర్తి చేశారు. శిఖరాన్నిచేరిన తండ్రీకొడుకులు ‘ఏస్​ ఫర్​ లైఫ్, సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని ఇచ్చారు. గతంలో వీరిద్దరూ యూరప్  ఖండంలోనే అత్యంత ఎత్తైన రష్యాలోని మౌంట్  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా అధిరోహించారు.