
పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఫస్ట్ డేనే బీఆర్ఎస్ కు షాకులమీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో వర్గవిభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాసేపటి క్రితమే పెద్దపల్లి టికెట్ ఆశించిన ఆ పార్టీ సీనియర్ లీడర్ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేయగా.. ఇపుడు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఎమ్మెల్యే రేఖా నాయక్ రేపు(ఆగస్టు 22న) కాంగ్రెస్ లో చేరబోతున్నారు.
కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల లిస్టులో రేఖా నాయక్ కు సీటు దక్కలేదు. ఖానాపూర్ లో రేఖా నాయక్ కు బదులుగాజాన్సన్ కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. రేఖా నాయక్ చుట్టూ వివాదాలున్నాయనే కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.