
శివ కార్తిక్ డైరెక్షన్ లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘కే3 కోటికొక్కడు’ సినిమా తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ మూవీని తెలుగులోనూ భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ‘కే 3 కోటికొక్కడు’పై తెలుగులో మంచి అంచనాలు ఉండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. జూన్ 17న ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది .
The Mass Masala Entertainer of Baadshah @KicchaSudeep's #K3Kotikokkadu is gearing up for a Grand Theatrical Release on 17th June???@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @shreyasmedia @anandaudioTolly @K3Kotikokkadu pic.twitter.com/YyIl9C9fZH
— Ramesh Bala (@rameshlaus) May 29, 2022
సుదీప్ సరసన మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఫస్ట్ సింగల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరో కిచ్చా సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినామాగా రికార్డు సృష్టించిందని, తెలుగులోనూ ‘కే3 కోటికొక్కడు’ మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నిర్మాతలు.