భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్...బార్ అసోసియేషన్ ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్...బార్ అసోసియేషన్ ఎన్నిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా కిరణ్  ముదల్కర్, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు​ఎన్నికయ్యారు. గురువారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల అధికారులు ఫలితాలను శుక్రవారం రిలీజ్​ చేశారు. అధ్యక్ష పదవికి కిరణ్​ కుమార్, లక్కినేని సత్యనారాయణ మధ్య పోటీ జరగగా, 30 ఓట్లతో కిరణ్​కుమార్​ విజయం సాధించారు. 

ఉపాధ్యక్షుడిగా షేక్​ షాజహాన్​ పర్వీన్, కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా జి. సంధ్యారాణి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శులుగా బానోత్​ దేవదాస్, నకిరికంటి ఉమ ఎన్నికయ్యారు. మహిళా రిప్రజెంటేటివ్​గా మల్లెల ఉషారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.