హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు.

