V6 News

కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, అనుచరుల అరాచకం.. టోల్ ప్లాజా దగ్గర జుట్టు పట్టుకుని మహిళపై దాడి

కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, అనుచరుల అరాచకం.. టోల్ ప్లాజా దగ్గర జుట్టు పట్టుకుని మహిళపై దాడి

అన్నమయ్య జిల్లా హైవే టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా దగ్గర మహిళా సిబ్బంది, మేనేజర్ రవిపై, సిబ్బందిపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మహిళలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడికి దిగారు. అక్కడ పనిచేసే మేనేజర్ రవిని కొట్టి.. ఎమ్మెల్యే అనుచరులు కారులో ఎక్కించుకుని వెళ్లారు.