ఇండియాలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ముగిసినట్లేనని కేంద్ర హోంశాఖ ప్రకటించిన తరుణంలో.. మరోసారి భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ. 2026 ఏప్రిల్ 25న తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా మొత్తం 34 ఆయుధాలను పోలీసులకు సమర్పించారు.
లొంగుబాటు గురించి మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి.. తెలంగాణ పోలీసుల ఆపరేషన్స్‌కు భారీ విజయం అని అన్నారు. సరెండర్ అయిన 47 మంది ఛత్తీస్ గఢ్ కు చెందిన వారిగా చెప్పారు. ఇది మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి దెబ్బగా గా అభివర్ణించారు. ఈ పరిణామం ఇతర మావోయిస్టులకు హెచ్చరికగా పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పునరావాస విధానాల ఫలితంగా పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి రీహాబిలిటేషన్, సాయం అందిస్తామన్నారు. లొంగిపోయిన వారిలో కీలక నేత హేమ్లా విజ్జ అలియాస్ ఐతు కూడా ఉన్నారు. ఐతు దండకారణ్య స్పెషల్ జోన్ ఇంచార్జ్.
కేంద్ర హోం శాఖ చేపట్టిన ఆపరేషన్ కగార్ లో దాదాపు కీలక నేతలంతా లొంగిపోయారు. ఇండియాలో మావోయిస్టు పార్టీ దాదాపు క్లోజ్ అని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో మరోసారి భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడంతో ఆపార్టీ కార్యకలపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని అంటున్నారు.

