V6 News

బాల్ బాల్కు బాదుడే : 16 ఫోర్లు, 9 సిక్సులతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విధ్వంసం

బాల్ బాల్కు బాదుడే : 16 ఫోర్లు, 9 సిక్సులతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విధ్వంసం

IPL మజా మామూలుగా లేదు. వీకెండ్.. అందులోను శనివారం జరిగిన మ్యాచ్ మాంచి కిక్ ఇచ్చింది. 2026,ఏప్రిల్ 25వ తేదీన ఢిల్లీ వేదికగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్.. బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించాడు. బౌలర్లను ఊచకోత కోశాడు. బాల్ బాల్ కు బాదుడే. జస్ట్ 67 బంతులు ఆడాడు.. ఏకంగా 152 పరుగులు చేశాడు.. ఈ 152 పరుగుల్లో.. 16 ఫోర్లు.. అంటే 64 రన్స్ ఫోర్ల ద్వారానే వచ్చాయి.

ఇక సిక్సుల విషయానికి వస్తే ఏకంగా 9 కొట్టాడు. అంటే 54 రన్స్ వచ్చాయి. జస్ట్ ఫోర్లు, సిక్సులతో సెంచరీ కొట్టేశాడు కేఎల్ రాహుల్. బాల్ బాల్ కే బాదుడు అంటే ఇదే అన్నట్లు.. తన బ్యాటింగ్ విశ్వరూపంతో స్టేడియం మొత్తాన్ని ఊర్రూతలూగించాడు. 67 బంతుల్లో.. 152 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రాహుల్. స్ట్రయికింగ్ రేట్ 226.87గా ఉంది. ఐపీఎల్లో 150 స్కోర్ చేసిన ఫస్ట్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు.

20 ఓవర్లలో 264 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్ కు 265 పరుగులు టార్గెట్ ఇచ్చింది. ఐపీఎల్ ఈ సీజన్ లో ఇదే హయ్యస్ట్ స్కోర్ కావటం విశేషం. ఈ టార్గెట్ ను పంజాబ్ చేధిస్తే మాత్రం.. అదో మరో రికార్డ్ కావటం ఖాయం.