మన్ కీ బాత్ ద్వారా.. ప్రజలను ప్రధాని చైతన్యపరుస్తున్నరు:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన్ కీ బాత్ ద్వారా.. ప్రజలను ప్రధాని చైతన్యపరుస్తున్నరు:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రతి నెల ప్రజలతో పంచుకుంటూ వారిని చైతన్యపరుస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదర్ గూడలోని అవంతి నగర్​లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి, స్థానిక ప్రజలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 

గత 11 ఏండ్లుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ వేదిక ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రధాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా నేటి ప్రసంగంలో తెలంగాణలోని మంచిర్యాల, సూర్యాపేట ప్రాంతాల అంశాలను ప్రస్తావించినందుకు ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అవంతి నగర్ పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్​ను కిషన్ రెడ్డి ప్రారంభించారు.